సద్గురు: నేను ఎన్నో పుణ్యక్షేత్రాలు, శక్తివంతమైన ప్రదేశాలు సందర్శించాను, అలాగే ఎందరో మహాత్ములను చూశాను - వారిని చూసినప్పుడు మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను; కానీ ఎప్పుడూ, మా గురువు గారికి నమస్కరించే దానికంటే కొంచెం తక్కువగా నమస్కరిస్తాను. అది కేదార్‌నాథ్ కానివ్వండి, గౌతమ బుద్ధుడు కానివ్వండి, లేదా నా ఎదుట ఉన్న వ్యక్తి కానివ్వండి, నేను వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తాను, కానీ మా గురువు గారికి నమస్కరించే దానికంటే కొంచెం తక్కువగా నమస్కరిస్తాను. కానీ కైలాష్’కు నమస్కరించేటప్పుడు మాత్రం మా గురువు గారికి నమస్కరించే విధంగా నమస్కరిస్తాను. నా జీవితంలో ఇంతకు ముందెప్పుడూ నేను దేనికీ లేదా ఎవరికీ అలా నమస్కరించ లేదు. నేనెప్పుడూ కొంచెం అదనంగా అట్టిపెట్టే వాణ్ణి. కానీ నేను కైలాష్’కు నమస్కరించేటప్పుడు మాత్రం అచ్చం మా గురువు గారికి నమస్కరించే విధంగా నమస్కరిస్తాను. కైలాష్ అనేది ఈ భూమ్మీదనే అత్యంత నిగూఢ గ్రంథాలయం. ఆంతరంగిక పార్శ్వాల విషయానికొస్తే, మీరు తెలుసుకోవాలనుకునే ప్రతిదీ కైలాష్’లో ఉంది. ఎలా గ్రహించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలిసి ఉంటే - మీ సృష్టి గురించి, మీ పుట్టుక ఇంకా మీ ఉనికి గురించి, అలాగే మీ విముక్తి గురించి - మీరు తెలుసుకోవాలనుకునే ప్రతిదీ కైలాష్’లో ఉంది. ప్రతి సంప్రదాయం ఈ జ్ఞానాన్ని అక్కడ నిక్షిప్తం చేసింది, అది అందుబాటులో ఉంది కూడా. ఎవరైనా తమ గ్రహణశక్తిలో తగినంత స్పష్టతను తీసుకురావడానికి సుముఖంగా ఉన్నట్లయితే, అది వారికి స్పష్టంగా కనిపిస్తుంది. English Video: https://youtube.com/shorts/ZQXJr6N0ZXI?feature=shared #shiva #mahadev #haraharamahadev #devotional #telugu #reels #viralreels #yt #ytshortsindia #ytviral #sadhgurureels మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్ https://www.facebook.com/SadhguruTelugu అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా https://www.instagram.com/p/CiWyiWdufDh/?igshid=YmMyMTA2M2Y= సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.