కోడి ఆమె స్నేహితులు నీతి కథ || Hen and lazy friends 3D animated Telugu video || rsk Telugu stories #Chickenandlazyfriends #telugukathalu #bedtimestories ************ కోడి- ఆమె స్నేహితులు ************* ఒక ఊరిలో ఒక కోడి వుండేది.. అది పగలంతా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆహారం కోసం అన్వేషించేది. రాత్రి కాగానే అవన్నీ గూటికి చేరి హాయిగా నిదురించేవి.. ఆ కోడికి ఒక బాతు, కాకి, మేకపిల్లలతో మంచి స్నేహం వుంది. అవన్నీ కలిసి సంతోషంగా జీవించేవి. ఒకరోజు ఆహారపు వేటలో వున్న ఆ కోడికి వరి విత్తనాల మూట కనిపించింది. అప్పుడు ఆ కోడి ఇలా ఆలోచించింది. " ఇప్పుడు వీటిని తింటే నాకు మాత్రమే సరిపోతాయి.. అలా కాకుండా నా మిత్రుల సహాయంతో వీటిని నాటితే బోలెడు పంట పండుతుంది.. అప్పుడు అందరం కలిసి ఆనందంగా తినవచ్చు.. " అనుకున్నదే తడవుగా ఆ మూటను తీసుకుని మిత్రుల దగ్గరకు వెళ్లింది కోడి. " మిత్రులారా.. నేను ఈ విత్తనాలను నాటాలనుకుంటున్నాను .. మీలో ఎవరు నాకు సాయ పడతారు." అని అడిగింది. "నేను అయితే సహాయ పడలేను.. " అంటూ బాతు నిరాకరించింది. " నా వల్ల కాదు." అంటూ కాకి తప్పించుకుంది. "నన్ను లెక్కల్లోకి తీసుకోవద్దు." అంటూ మేక వెనక్కి తిరిగింది. "సరే అయితే.. తప్పదుగా.. నేనే స్వయంగా వీటిని నాటుతాను..” అని కోడి ఆ మూటలోని విత్తనాలను చాలా ఓపికగా పొలంలో నాటింది. నాటిని కొద్ది కాలానికే పంట చాలా బాగా పండింది.. ఆ కోడి ఆనందానికైతే అంతేలేదు.. మళ్లీ మిత్రులతో ఇలా అడిగింది.. " మిత్రులారా .. పంట చేతికొచ్చింది.. పనులు మొదలు పెడితే మంచిది.. ఇంకా ఆలస్యం చేస్తే వానలు కురిసి మొత్తం నేలపాలవుతుంది... పంటను కోయాలనుకుంటున్నాను.. మీలో ఎవరు నాకు సాయ పడతారు." "నేను అయితే సహాయ పడలేను.. " అంటూ బాతు నిరాకరించింది. " నా వల్ల కాదు." అంటూ కాకి తప్పించుకుంది. "నన్ను లెక్కల్లోకి తీసుకోవద్దు." అంటూ మేక వేగంగా వెనక్కి తిరిగింది. "సరే అయితే.. విత్తనాలను నాటిన దానిని, నాకు తప్పదుగా.. నేనే స్వయంగా పంటను కోసి జాగ్రత్త పరుస్తాను.” అని కోడి రోజంతా శ్రమించి పంటను కోసి, సంచులలో నింపి తన గూటికి చేర్చింది. ఒకనాడు తను పండించిన దానితో మంచి భోజనం తయారుచేయాలని భావించింది కోడి.. తన స్నేహితులతో ఇలా అంది. " మిత్రులారా.. నేను ఈ రోజు రుచికరమైన బిర్యానీ చేయాలను కుంటున్నాను.. మీలో ఎవరు నాకు సాయ పడతారు." ముగ్గురూ ఎప్పటిలానే యథావిధిగా నిరాకరించి వెళ్లిపోయారు. దాంతో కోడి ఒక్కత్తే చాలా కష్టాలు పడి బిర్యానీ తయారు చేసింది. బిర్యానీ చాలా బాగా వచ్చింది. ఆ ప్రదేశం మొత్తం ఘుమఘుమలతో నిండి పోయింది. ఆ వాసనకు బాతు, కాకి, మేక లొట్టలు వేసుకుంటూ నెమ్మదిగా అక్కడికి వచ్చాయి.. ఇంతకు ముందు తప్పించుకు తిరిగిన అవి మూడూ, ఇప్పుడు ఏం చెబుతాయో తెలుసుకుందామని కోడి ఇలా అడిగింది. " మిత్రులారా.. మీలో ఎవరు బిర్యానీ తినాలనుకుంటున్నారు?" "నేను తినాలనుకుంటున్నాను!" అని బాతు ఆ బిర్యానీని చూసి ఎగిరి గంతేసి సమాధానం ఇచ్చింది. "నేను కూడా" అప్పటికే పిల్లి నోటిలో నీళ్ళూరాయి. " నోరూరించే ఈ బిర్యానీని ఎవరైనా వదులుకుంటారా.. నాకూ కావాలి.." అన్నది మేక చాలా ఆత్రంగా. “క్షమించండి మిత్రులారా.. మీలో ఎవ్వరికీ ఈ బిర్యానీ తినే అర్హత లేదు.. ఎందుకంటే, విత్తనాలు నాటినప్పుడు, పంట కోసినప్పుడు, చివరికి ఈ బిర్యానీ వండినప్పుడు కూడా ఎవరూ సాయపడలేదు.. అప్పుడు తప్పించుకుని తిరిగి ఇప్పుడు అనుభవించాలంటే ఎలా కుదురుతుంది.. ఇక మీరు బయలుదేరండీ.." అన్నది కోడి.. తమ బద్దకపు చేష్టల కారణంగా వేడి వేడి రుచికరమైన బిర్యానీ వదులుకోవలసి వచ్చినందుకు బాతు, కాకి, మేక తమను తాము తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాయి.. తర్వాత తన పిల్లలతో కలిసి కోడి ఆహారాన్నంతా హాయిగా, సంతోషంగా తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే.. " కష్టపడనిదే ఫలితం రాదు."